మొదటిదిగా :::::------
Deuteronomy(ద్వితీయోపదేశకాండము) 18:18,19
వారి సహోదరులలోనుండి నీవంటి ప్రవక్తను వారికొరకు పుట్టించెదను; అతని నోట నా మాటల నుంచుదును; నేను అతని కాజ్ఞా పించునది యావత్తును అతడు వారితో చెప్పును.
అతడు నా నామమున చెప్పు నా మాటలను విననివానిని దాని గూర్చి విచారణ చేసెదను.
వారి సహోదరులు అంటే ఎవరు ?
అంటే ఇజ్రాయేల్ సహోదరులు
ఇజ్రాయేల్ సహోదరులు ఎవరు??
యూదులు లేకపోతె ఏశావు సంతానం కావాలి
ఇష్మాయేల్ సంతానం ఎలా అఉతుంది
యాకోబుకి ఇష్మాయేలు పెద్దనాన్న అఉతాడు
పెద్దనాన్న కుమారులు యాకోబుకి సోదరులు అఉతారు కానీ యాకోబు సంతానానికి ఎలా అఉతారు ??
రెండవదిగా :::---
ఆ ప్రవక్త ??
ఆ ప్రవక్త ముహమ్మద్ అంట ??
మోసె వారు చెప్పిన ఒకే ఒక్క ప్రవక్త
అది యేసు రాకతో నెరవేరింది
వచనాలు కావాలా???
Acts(అపొస్తలుల కార్యములు) 3:22,23,24
మోషే యిట్లనెనుప్రభువైన దేవుడు నావంటి యొక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీకొరకు పుట్టించును; ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరాయన మాట వినవలెను.(లేక, విందురు)
ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజలలో ఉండకుండ సర్వనాశనమగుననెను.
మరియు సమూయేలు మొదలుకొని యెందరు ప్రవక్తలు ప్రవచించిరో వారందరు ఈ దినమునుగూర్చి ప్రకటించిరి.
ఏ దినము ఏసు చనిపోయి తిరిగి లేచిన దినము
Luke(లూకా సువార్త) 7:39
ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచిఈయన ప్రవక్తయైన యెడల(కొన్ని ప్రాచీన ప్రతులలో-ఆ ప్రవక్తయైన యెడల, అని పాఠాంతరము) తన్ను ముట్టుకొనిన యీ స్త్రీ ఎవతెయో ఎటువంటిదో యెరిగియుండును; ఇది పాపాత్మురాలు అని తనలో తాననుకొనెను.
పరిసయ్యుడు ఆ ప్రవక్త ఏసే అని తెలుసుకున్నాడు
మూడవదిగా::-----
బలులు
బలులు అర్పించమని దేవుడె చెప్పియున్నాడు
Hebrews(హెబ్రీయులకు) 9:19,20,21,22
ధర్మశాస్త్రప్రకారము మోషే ప్రతి యాజ్ఞను ప్రజలతో చెప్పినతరువాత, ఆయన నీళ్లతోను, రక్తవర్ణముగల గొఱ్ఱెబొచ్చుతోను, హిస్సోపుతోను,కోడెలయొక్కయు మేకలయొక్కయు రక్తమును తీసికొని
దేవుడు మీకొరకు విధించిన నిబంధన రక్తమిదే అని చెప్పుచు, గ్రంథముమీదను ప్రజలందరి మీదను ప్రోక్షించెను.
అదేవిధముగా గుడారముమీదను సేవాపాత్రలన్నిటి మీదను ఆ రక్తమును ప్రోక్షించెను.
మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులును రక్తముచేత శుద్ధిచేయబడుననియు, రక్తము చిందింపకుండ పాప క్షమాపణ కలుగదనియు సామాన్యముగా చెప్పవచ్చును.
మోసే చెప్పింది తప్పు అంటే దేవుడు నే తప్పు అన్నట్లే
ఈ బలుల కోసము వాళ్లే గొర్రెలను సిద్దం చేసుకునేవారు
దేఉడే యేసు ను గొర్రెపిల్లగా బలి గా సిద్దంచేశాడు
Zephaniah(జెఫన్యా) 1:7
ప్రభువైన యెహోవా దినము సమీపమాయెను, ఆయన బలియొకటి సిద్ధపరచియున్నాడు, తాను పిలిచిన వారిని ఆయన ప్రతిష్ఠించియున్నాడు, యెహోవా సన్నిధిని మౌనముగా నుండుడి.
నాలుగవదిగా ::--
ఆదరన కర్త
1 John(మొదటి యోహాను) 2:1
నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై యీ సంగతులను మీకు వ్రాయుచున్నాను. ఎవడైనను పాపము చేసినయెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది(ఆదరణకర్త) తండ్రియొద్ద మనకున్నాడు.
అపొస్తలులు 2వ అద్యాయములో ఆ ప్రవచనం నెరవేరింది
పాపాలకు బలి అవసరం లేదు అంటే
ఓ మానవా నువ్వె దేవుడుకి చెప్పేవాడవా
దేవుడు ధర్మశాస్త్రము ను తిరస్కారము చేస్తున్నావా ??
మేము అలా చేయలేదు నెరవేరుస్తున్నాము
ఆలోచించుకో ......
By
అగాపే క్రీస్తు ప్రేమ